Site icon NTV Telugu

Kamal Haasan: కమల్ బర్త్ డే వేడుకలు.. రాధికతో స్టెప్పులు అదరగొట్టిన లోక నాయకుడు

Kamal

Kamal

Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవలే తన 68 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. విక్రమ్ సినిమాతో పూర్వ వైభవాన్ని అందుకున్న కమల్.. ఆ సంతోషంతో ఈ పుట్టినరోజు పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులందరికీ కమల్ పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి హీరో సిద్దార్థ్, బిందు మాధవి, ఖుష్బూ, రాధికా శరత్ కుమార్ తో పాటు కోలీవుడ్ మొత్తం హాజరయ్యింది. ఇక ఈ పార్టీలో కమల్, రాధికాతో కలిసి స్టెప్పులు వేశారు. తాను నటించిన విక్రమ్ సినిమాలోని పతల పతల సాంగ్ కు రాధికా, కమల్ స్టెప్పులు అదరగొట్టారు.

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో రాధికా, కమల్ కనిపించారు. సినిమాలో చేసిన స్టెప్స్ ను యథావిధిగా కమల్ దింపేశారు. ఇక రాధికా కూడా ఎంతో ఎనర్జీగా కమల్ కు తగ్గట్టు స్టెప్స్ వేసి అలరించింది. స్వాతి ముత్యం సినిమాలో ఈ జంట కలిసి నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version