Site icon NTV Telugu

Raakshasa Kaavyam: ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి..విలన్లు కూడా గెలవాలి కదా!

Kalyan Singanamala Interview About Raakshasa Kaavyam

Kalyan Singanamala Interview About Raakshasa Kaavyam

Kalyan Singanamala Interview about Raakshasa Kaavyam Movie:  సినిమా మీద ఇష్టం ఏర్పడితే ఏ వృత్తిలో ఉన్నా ఫిలిం ఇండస్ట్రీ వైపే ఆకర్షిస్తుంటుంది. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విదేశాల్లో ఉంటూ నిర్మాతగా, ఫైనాన్షియర్ గా సినిమాల మీద తనకున్న ప్యాషన్ చూపిస్తున్న శింగనమల కళ్యాణ్ తన సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్ మీద భాగ్ సాలే సినిమాను నిర్మించారు. ఇక ఇప్పుడు దాము రెడ్డితో కలిసి గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ పార్టనర్ షిప్లో రాక్షస కావ్యం సినిమా చేస్తున్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా “రాక్షస కావ్యం” సినిమా విశేషాలు, తన కెరీర్ జర్నీ గురించి శింగనమల కళ్యాణ్ పలు విశేషాలు పంచుకున్నారు.

MAD Movie: ‘మ్యాడ్’తో గట్టి హిట్ కొడుతున్నాం అన్నారూ.. కొట్టి చూపించాం!

ఒకరోజు ప్రొడ్యూసర్ దాము రెడ్డిని మధుర శ్రీధర్ రెడ్డి నా దగ్గరకు తీసుకొచ్చి “రాక్షస కావ్యం” సబ్జెక్ట్ బాగుంది, తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ మూవీ అని చెప్పగా సినిమా స్టోరీ లైన్ నచ్చి “రాక్షస కావ్యం” మూవీ ప్రొడక్షన్ లో అడుగుపెట్టానని అన్నారు. “రాక్షస కావ్యం” సినిమా కథ సహజంగా ఉంటూ రా అండ్ రస్టిక్ గా సాగుతుందని, ఎక్కువ మెలోడ్రామా చూపించడం లేదని అన్నారు. ఈ సినిమా మనం రియల్ లైఫ్ లో చూసేదానికి దగ్గరగా ఉంటుందని, ముఖ్యంగా దిగువ మధ్య తరగతికి చెందిన మనుషులు, బస్తీల్లో ఉండేవాళ్ల మైండ్ సెట్, జీవన విధానం మూవీలో కనిపిస్తుందని అన్నారు. అక్కడ తాగుడుకు బానిసై పిల్లలను చదివించకుండా పనికి పంపిస్తుంటారు, ఈ కథలో విలన్స్ కూడా గెలవాలి, ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి అనే కామెడీ పాయింట్ కూడా కొత్తగా ఉంటుందని అన్నారు. మన సినిమాల్లో విలన్స్ ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు, హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సరదా సీన్స్ కూడా ఉంటాయని అన్నారు. “రాక్షస కావ్యం” కథకు పురాణాల్లోని ఓ సందర్బం రిలేట్ అయి ఉంటుందని పేర్కొన్న ఆయన ఒక రుషి కైలాసగిరికి వస్తున్నప్పుడు ఇద్దరు ద్వారపాలకులకు అడ్డుకుంటారని, ఆ రుషి ఆగ్రహించి శపిస్తాడని అన్నారు. ఆ కాలంలోని ఇద్దరు ద్వారపాలకులు కలియుగంలో మళ్లీ పుట్టారనేది పోలిక అని వీళ్లిద్దరిలో ఒకరు హీరోల కంటే విలన్స్ ను ఇష్టపడతాడు, మరొకరు రాక్షసంగా అందర్నీ చంపే రౌడీగా కనిపిస్తాడని అన్నారు. ఈ సినిమా కథను చెప్పినదానికంటే బాగా తెరకెక్కించాడు దర్శకుడు, ఎలాంటి ఫాంటసీ, మెలోడ్రామా, ఫారిన్ లొకేషన్స్ షూట్స్ లేకుండా సహజంగా మనం బస్తీల్లో చూసే వ్యక్తుల జీవితాలను రా అండ్ రస్టిక్ గా రూపొందించాడని అన్నారు.

Exit mobile version