Site icon NTV Telugu

Kalyan Ram: వైరల్ అవుతున్న కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ పిక్

Kalyanram Family Pic

Kalyanram Family Pic

నందమూరి మూడోతరం నటుల్లో పేరు తెచ్చుకున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్న కళ్యాణ్‌ రామ్ తాజాగా ‘బింబిసార’గా రాబోతున్నాడు. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తన పుట్టినరోజుకు ముందు విడుదల చేశాడు.

ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన కల్యాణ్ రామ్ జూలై 5న కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు జరుపుకున్నాడు. కళ్యాణ్ రామ్ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ తో పాటు భార్య స్వాతి, కుమార్తె తారక అద్వైత, కుమారుడు సౌర్య రామ్‌ ఉన్నారు. నందమూరి అభిమానులు ఈ పిక్ ను వైరల్ చేస్తున్నారు. నిజానికి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీని పబ్లిక్ గా ఎక్స్ పోజ్ చేయటానికి అంత ఇష్టపడడు. అందుకే ఈ పిక్ అంతర్జాలంలో ట్రెండ్ అవుతోంది. ఇక మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ‘బింబిసార’ రెండు భాగాలుగా ఆగస్ట్ లో విడుదల కానుండటం… రెండో భాగంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడని అధికారికంగా ప్రకటించటంతో ఈ సినిమాపై ఫుల్ బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమాతో కళ్యాణ్‌ రామ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Exit mobile version