NTV Telugu Site icon

Devil: సైలెంట్ హిట్ గా నిలిచేలా ఉంది… డే 4 > డే 1

Devil

Devil

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి వచ్చింది. అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచి కంటెంట్ ఇవ్వడంతో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. రిలీజ్ డేట్ చాలా సార్లు మిస్ చేసుకున్న ఈ మూవీ మొదటిసారి చెప్పిన డేట్ కే రిలీజ్ చేసి ఉంటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో డెవిల్ మరో బింబిసారా అయ్యి ఉండేది. టాక్ యావరేజ్ గానే ఉంది కాబట్టి స్లోగా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ ఉండడం కూడా డెవిల్ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించింది. సలార్ జోష్ తగ్గి ఉంటే డెవిల్ ఓపెనింగ్స్ మరింత బాగుండేవేమో కానీ అలా జరగలేదు. అయితే స్లో అండ్ స్టడీగా డెవిల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పుంజుకుంటూ ఉంది.

డే 1 కన్నా డే 2… డే 2 కన్నా డే 3… డే 3 కన్నా డే 4 డెవిల్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. డెవిల్ డే 1 కన్నా డెవిల్ డే 4 కలెక్షన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. ఇంతే స్టేజీగా డెవిల్ ఇంకో వారం పాటు థియేటర్స్ లో నిలబడితే చాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాకపోవచ్చు. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన డెవిల్ సినిమా… 43 కోట్ల గ్రాస్ ని రాబడితే మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అయినట్లే. ప్రస్తుతానికి ఓవరాల్ గా నాలుగు రోజుల్లో డెవిల్ సినిమా 22.59 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మరో 19-20 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే డెవిల్ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. సంక్రాంతి సీజన్ వరకూ పెద్దగా సినిమాలు లేవు కాబట్టి రాబోయే 10 రోజులు డెవిల్ ఇదే పేస్ లో కలెక్షన్స్ ని రాబట్టినా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుంది. ఓపెనింగ్ డే రోజున కష్టం అనుకున్న సినిమా సైలెంట్ హిట్ అవ్వబోతుండడం గొప్ప విషయమే.