Kalyan Ram : కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. ఇందులో వైజయంతిగా విజయశాంతి నటిస్తోంది. తల్లి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడనేది అప్డేట్ ఇచ్చారు. మార్చి 31న ‘నా యాల్ది’ అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also : Betting Apps : బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం.. కేసులన్నీ…
ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా రాబోతోంది. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మొన్న రిలీజైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గతంలో కల్యాణ్ రామ్ ఏ టీజర్ కు రానంత వ్యూస్ వచ్చాయి దీనికి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది. విజయశాంతి గతంలో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. దాని తర్వాత మళ్లీ మూడేళ్లకు వెండితెరపై కనిపించబోతోంది. అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నా యాల్ది అనేది మాస్ సాంగ్ గా తెలుస్తోంది. కల్యాణ్ రామ్ ఇటు హీరోగా చేస్తూనే అటు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాకు నిర్మాతగా చేస్తున్నారు.