నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, నందమూరి అభిమానులని, సినిమా వర్గాలని దిగ్భ్రాంతికి గురి చేసింది. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి శనివారం నాడు తుది శ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. ఈ కార్యక్రమాలని నందమూరి బాలకృష్ణ అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫ్యామిలీతో పాటు తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తారకరత్న భౌతికకాయాన్ని చూస్తూ మౌనంగా నిలబడి పోయారు. ఆసుపత్రి నుంచి త్వరగా ఆరోగ్యంతో తిరిగివస్తాడు అనుకుంటే అన్నకి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయాడు అని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారకరత్న భౌతికకాయాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యం కలచివేసేలా ఉంది.
Read Also: Taraka Ratna: అన్ని తానై చూసుకుంటున్న బాలయ్య