NTV Telugu Site icon

Amigos: ఇంతకీ ఆ మిస్టరీ ఏంటో ట్రైలర్ లో అయినా చూపిస్తారా?

Amigos

Amigos

నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఫ్రెండ్స్ అనే అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టి, ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గురు కళ్యాణ్ రామ్ లని పెట్టి దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎలాంటి సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ అమిగోస్ నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా కంఫ్యూషన్ క్రియేట్ చేస్తోంది. ఒకసారి ఏమో ముగ్గురూ ఫ్రెండ్స్ అనిపించేలా ఒక సాంగ్ వస్తుంది, ఇంకోసారి ఏమో కళ్యాణ్ రామ్ గన్నులు పట్టుకోని తిరిగే పోస్టర్ వస్తుంది? టీజర్ వస్తేనేమో అందులో ముగ్గురి మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఒక కళ్యాణ్ రామ్ ఇంకో కళ్యాణ్ రామ్ కి ఫ్రెండ్ ఏమో అనుకునేలోపు ఒకరు ఇంకొకరిని చంపే అటెంప్ట్ చేస్తున్నారు. ఇవి చాలదన్నట్లు ముగ్గురు కళ్యాణ్ రామ్ లకి వేరు వేరు గెటప్స్ ని తీసేసి ఒకే గెటప్ లో చూపించడం మొదలుపెట్టారు. ఇక ఏ కళ్యాణ్ రామ్ ఎవరో? ఎవరు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తారో? అసలు ఒకేలా ఉన్న ముగ్గురు ఎందుకు కలిసారు? ఎందుకు విడిపోయారు?

ఇలా అమిగోస్ సినిమా విషయంలో రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలని మరింత పెంచుతూ రీసెంట్ గా అమిగోస్ నుంచి ‘ఎన్నో రాత్రులు వస్తాయి గాని’ సాంగ్ రిలీజ్ అయ్యింది. సాంగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, బాబాయ్ పాటకి అబ్బాయ్ బాగా న్యాయం చేశాడు అని పాటని ఎంజాయ్ చెయ్యలా లేక ఇంతకీ ఈ పాటలో ఉన్న కళ్యాణ్ రామ్ ఎవరో? ఫస్ట్ అతనా, సెకండ్ అతనా లేక థర్డ్ అతనా అని ఆలోచించాలా అనేది అర్ధం కాదు. ఇన్ని కంఫ్యూషన్స్ మధ్య అమిగోస్ నుంచి ట్రైలర్ వచ్చేస్తుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మైత్రీ మూవీ మేకర్స్. ఫిబ్రవరి 3న అమిగోస్ ట్రైలర్ బయటకి రాబోతుంది, మరి ఆ ట్రైలర్ లో అయినా మిస్టరీని కొంచెం క్లియర్ చేసి స్టొరీ గురించి హింట్ ఇస్తారా? లేక ఫిబ్రవరి 10న థియేటర్స్ కి వచ్చి మీ అనుమానాలు అన్ని తీర్చేసుకోండి అని అలానే వదిలేస్తారా అనేది చూడాలి.

Show comments