Site icon NTV Telugu

Amigos: మొన్న సిద్దార్థ్, ఈరోజు మంజునాథ్… కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నాడే

Amigos

Amigos

నందమూరి కళ్యాణ్ రామ్… తమ్ముడు ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నట్లు ఉన్నాడు. ఒకప్పటిలా కాకుండా ఎన్టీఆర్ సినిమా సినిమాకి లుక్ విషయంలో చాలా వేరిఎషణ్స్ చూపిస్తున్నాడు. ఏ సినిమా చేసినా అందులో తన లుక్ ని పూర్తిగా మార్చేసి, కొత్తగా కనిపిస్తున్న ఎన్టీఆర్ ని స్పూర్తిగా తీసుకున్నట్లు ఉన్నాడు కళ్యాణ్ రామ్. తమ్ముడు సినిమా సినిమాకి లుక్ లో చేంజెస్ చేస్తే, తానేమి తక్కువ కాదు అన్నట్లు ఒకే సినిమాలో రెండు వేరియేషన్స్ ని చూపిస్తున్నాడు. బింబిసార సినిమాలో రాజు లుక్ లో మరియు మోడరన్ లుక్ లో కనిపించి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, ఈసారి కూడా అదే ట్రాక్ లోకి వెళ్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ ఇటివలే రిలీజ్ చేశారు. The Doppelganger 1 అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ‘బిజినెస్ మాన్ సిద్దార్థ్’గా కనిపించాడు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా బయటకి వచ్చిన ఆ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు.

తాజాగా ‘అమిగోస్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ బయటకి వచ్చింది, The Doppelganger 2 అంటూ మేకర్స్ ‘అమిగోస్’ కొత్త పోస్టర్ ని లాంచ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ ‘సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మంజునాథ్’గా కనిపించాడు. ఫార్మల్స్ వేసుకోని, క్లీన్ షేవ్ చేసుకోని, సైడ్ క్రాఫ్ దువ్వుకోని పూర్తిగా క్లాస్ లుక్ లో కనిపించాడు కళ్యాణ్ రామ్. అమిగోస్ టీజర్ ని త్వరలో రిలీజ్ చెయ్యబోతున్నాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని రాజేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ‘అమిగోస్’ సినిమాతో కళ్యాణ్ రామ్ తన హిట్ స్ట్రీక్ ని కంటిన్యు చేస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే The Doppelganger అనే పదాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ‘అమిగోస్’ సినిమాకి సంబంధించిన ప్రతి పోస్టర్ లో వాడుతున్నారు, ఈ పదానికి అర్ధం “బయోలాజికల్ సంబంధం లేకున్నా, మన లాగే ఉండే మరో వ్యక్తి” అని అర్ధం. విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు, విక్రం సింగ్ రాథోడ్ లాగా అన్నమాట. ఈ ఇద్దరూ అన్నదమ్ములు కాదు, తండ్రి కొడుకులు కాదు, బంధు మిత్రులు అసలే కాదు కానీ చూడడానికి మాత్రం ఒకేలా ఉంటారు. ఇలాంటి వాళ్లనే ‘Doppleganger’ అంటారు. మరి కళ్యాణ్ రామ్ ఎవరికి “లుక్ ఏ లైక్” పర్సనాలిటీలాగా ఉన్నాడో తెలియాలి అంటే 2023 ఫిబ్రవరి 10 వరకూ ఆగాల్సిందే.

Exit mobile version