Kalyan Ram about Producing Movies: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత అమిగోస్ కూడా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన నేపథ్యంలో తాను నిర్మాతగా ఎందుకు సైలెంట్ అయ్యాను అనే విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. నిజానికి తనకు నటన అంటే చాలా ఇష్టమని అయితే అది అంత ఈజీ టాస్క్ కాదని చెప్పుకొచ్చాడు.
Salaar: నైజాంలో 50 కోట్ల “సలార్”.. నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు కొట్టేశాడు!
నటన ఈజీ కాదు అనుకుంటాం కానీ నిర్మాణం అంతకన్నా కష్టమైన పని అని ఆయన అన్నారు. తాను ఒకపక్క నటిస్తూ మరోపక్క సినిమాలు నిర్మించడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టినట్లు అనిపించిందని, ఓం సినిమా తర్వాత తనకు ఆ విషయం అర్థం అయి నిర్మాణం మీద పూర్తిగా ఫోకస్ తగ్గించాలని అన్నాడు. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద తన బావమరిది కొసరాజు హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానిమీద తనకు 100% భరోసా ఉంటుందని అన్నారు కళ్యాణ్ రామ్. ఆయన సినిమా ఒప్పుకున్నాడు అంటే అందులో మళ్లీ వంక పెట్టాల్సిన అవసరం లేదని, తాను అంతగా తన బావమరిదిని నమ్ముతున్నానని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సినిమాల నిర్మాణం విషయంలో తాను కేవలం స్టోరీ సిట్టింగ్స్ లో మాత్రమే ఉంటానని, స్టోరీ ఫైనలైజ్ అయిన తర్వాత ఆ విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని ఆయన చెప్పుకొచ్చాడు.