NTV Telugu Site icon

Kalpika Ganesh: స్టార్ కమెడియన్ పై నటి ఘాటు ఆరోపణలు.. తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు

Kalpika

Kalpika

Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లకు అక్కగా, సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలో నటించి మెప్పించింది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంతకు అక్కగా నటించి మంచి తెచ్చుకొంది. ప్రస్తుతం కల్పిక పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.ల ఇక ఈ భామ తాజాగా కమెడియన్ అభినవ్ గోమటంపై ఘాటు ఆరోపణలు చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవలే కల్పిక గణేష్ కు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక అవార్డు వచ్చింది. దీంతో ప్రతిఒక్కరు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపగా.. అభినవ్ మాత్రం ఆమెను అవమానించాడట.. ఐటెం అంటూ ఆమెను కించపరుస్తూ మాట్లాడని, ఇందుకు అతను సారీ చెప్పాలని ఆమె సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేసింది. ఇక అభినవ్ మాత్రం తాను ఎవరికి సారీ చెప్పే అవసరం లేదని, తన పేరును ఎంత ట్యాగ్ చేసినా సారీ చెప్పనని తేల్చి చెప్పాడు. ఇక ఆ స్క్రీన్ షార్ట్ తీసుకొని కల్పిక, తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. కవిత కల్వకుంట్ల ను ట్యాగ్ చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. తాను ఇలా చేస్తున్నానని వాళ్ళ ఫ్రెండ్స్ తన ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయించాలని చూస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సోషల్ వార్ మరోసారి మీటూ ఉద్యమానికి తెరలేపినట్లు అయ్యింది. ఇందులో కొంతమంది అభినవ్ కు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కల్పికకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక అభినవ్.. ఈ నగరానికి ఏమైంది చిత్రంలో కౌశిక్ గా ఫేమస్ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అభినవ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.