Site icon NTV Telugu

Kalpika Ganesh: వేశ్యలా కనిపిస్తున్నానా.? ‘ఎల్’ కేటగిరి అంటూ ట్రోల్ చేస్తున్నారు.?

Kalpika

Kalpika

Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. హీరోయిన్ కు అక్కగా, ఫ్రెండ్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవలే యశోద సినిమాలో సమంత ఫ్రెండ్ గా కనిపించి మంచి గుర్తింపును అందుకొంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే కల్పిక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం తో సోషల్ మీడియా వార్ కు కూడా దిగి అందరి నోళ్ళలో నానింది.

ఇక అప్పటినుంచి అమ్మడిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసభ్య పదజాలంతో కల్పికను ఆడేసుకుంటున్నాడు. అయితే తాజాగా ట్రోలర్స్ పై విరుచుకు పడింది కల్పికా గణేష్. తన గురించి ఏమనుకుంటున్నారు అంటూ మండిపడింది. ” ‘నేనేమైనా వేశ్యలా కనిపిస్తున్నానా.? ‘ఎల్’ కేటగిరి అంటూ ట్రోల్ చేస్తున్నారు.?. అలనాటి హీరోయిన్స్ సావిత్రి, సరోజా దేవి లాంటి వాళ్ళు కూడా టైట్ డ్రెస్ లు వేసుకున్నారు.. అప్పుడు వాళ్లని ఎవరూ ఏమీ అనలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయ్యింది కాబట్టి ట్రోల్స్ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నించింది. ట్రోలర్స్ పై సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వారు కూడా ఆడవారి బాధలను పట్టించుకోవడం లేదని” మండిపడింది. ప్రస్తుతం కల్పిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version