NTV Telugu Site icon

Kalki – Bujji: 6 టన్నులు-6 కోట్లు.. 30 గంటలు.. ‘బుజ్జి’ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్!

Kalki Bujji Speciality

Kalki Bujji Speciality

Kalki Bujji Speciality: కల్కి సినిమాను నేషనల్ వైడ్ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసింది సినిమా యూనిట్. అందులో భాగంగానే నిన్న ఒక భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ దెబ్బకి ప్రస్తుతం ఎక్కడ చూసిన బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. అసలు ఈ బుజ్జికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని ఆరా తీసే పనిలో ఉన్నారు నెటిజన్స్. కల్కి సినిమాలో బుజ్జి అనేది ప్రభాస్ కారు పేరు. ఈ కారును వినూత్న‌మైన డిజైన్‌తో త‌యారు చేయించారు. అందుకే స్పెషల్ ఈవెంట్‌తో బుజ్జిని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. దీంతో.. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? ఎక్కడ తయారు చేశారు? అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జయెమ్‌ ఆటోమోటివ్‌ సంస్థలు సంయక్తంగా రూపొందించాయి. ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. బుజ్జిని దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు.

Hema: పాజిటివ్ వచ్చిందా ఏం చేసుకుంటారో చేసుకోండి.. హేమ షాకింగ్ కామెంట్స్!

ఈ కారు తయారికీ దాదాపు 6-7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జికి చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయని, ఇది గాల్లో కూడా ఎగరగలదని అంటున్నారు. స్క్రాచ్‌తో తయారు చేసిన ఒక్కొక్క టైర్ రిమ్ సైజ్ 34.5 ఇంచులుగా ఉంటుందని చెబుతున్నారు. టైర్‌తో కలిపి ఇది దాదాపు ఒక మనిషిలో సగానికి పైగా హైట్‌తో భారీ సైజుతో ఉంది. 6075 MM లెంగ్త్, 3380 MM విడ్త్, 2186 MM హైట్‌తో బుజ్జిని డిజైన్ చేశారు. 9800 న్యూటన్ మీటర్ టార్క్, 94 కిలో వాట్స్ పవర్‌, 47 కిలోవాట్ అవర్ బ్యాటరీతో బుజ్జి నడుస్తుంది. ఇదే కాదు.. సినిమాలో బుజ్జి గురించి ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయని చెబుతోంది సినిమా యూనిట్. ఇక ఈ కారు ఒక టైర్ బిగించడానికి 30 గంటలు పడుతుందని టీం చెబుతోంది. మొత్తంగా.. భవిష్యత్‌లో ఉండే కార్ ఎలా ఉంటుందో ఊహించుకొని బుజ్జిని డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇక బుజ్జితోనే దేశమంతటా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ముంబై, చెన్నై, కొచ్చి, బెంగ‌ళూరు లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో బుజ్జిని ప్రమోషన్స్ కోసం తీసుకెళ్లనున్నారని అంటున్నారు. అయితే బుజ్జి గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే.. జూన్‌ 27 వరకు వెయిట్ చేయాల్సిందే!

Show comments