NTV Telugu Site icon

Kalki 2898 AD: ట్రైలర్ 2 లీక్.. మాటల్లేవ్ అంతే!

Kalki (3)

Kalki (3)

kalki 2898 AD Second Trailer Leaked: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. కల్కి సెకండ్ ట్రైలర్ లీక్ అయినట్లు ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో.. ఎలాగు ట్రైలర్ లీక్ అయింది కదా.. ఇక రిలీజ్ చేయండి.. అంటూ ఓ రేంజ్‌లో లీక్డ్ ట్రైలర్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. ఈ లీక్డ్ ట్రైలర్ వితౌట్ ఆడియోతో ఉంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. నిజంగా మాటల్లేవ్ అనే చెప్పాలి. ఫస్ట్ ట్రైలర్‌ను వావ్ ఫ్యాక్టర్ లేకుండా కట్ చేసిన నాగ్ అశ్విన్.. సెకండ్ ట్రైలర్‌ను మాత్రం పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో నింపేశాడు. అశ్వద్ధామ, భైరవ మధ్య జరిగే యుద్ధం, ఆ యాక్షన్ కట్స్, ఆ విజువల్స్ చూస్తే వావ్ అనాల్సిందే.

Vedhika: వేయడానికి 3 గంటలు.. తీయడానికి 2 గంటలు.. ‘యక్షిణి’ కష్టాలు బయటపెట్టిన వేదిక

అసలు ఈ ట్రైలర్ రిలీజ్ అయితే కల్కి పై అంచనాలు పీక్స్‌కు వెళ్లడం గ్యారెంటీ.. అనేలా కట్ చేశారు. సౌండ్ లేకుండా చూస్తేనే ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక సౌండ్ ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ శాంపిల్.. ఇదే అసలైంది అన్నట్టుగా ఉంది. నిమిషంన్నరకు పైగా నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌తోనే మూడు గంటల సినిమా చూపించేశాడు నాగి. అందుకే.. అర్జెంట్‌గా కల్కి సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే.. మేకర్స్ సైడ్ నుంచి ఇంకా రిప్లై రావడం లేదు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. లేటెస్ట్‌గా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఈ ఈవెంట్‌కు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, అశ్వినీదత్, దీపికా పదుకొనే హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఏదేమైనా.. కల్కి సెకండ్ ట్రైలర్ అప్డేట్ ఏ క్షణమైనా బయటకు రావచ్చు.

Show comments