NTV Telugu Site icon

KALI Movie Teaser: కలి టీజర్ రిలీజ్ చేసిన కల్కి డైరెక్టర్

Maxresdefault

Maxresdefault

KALI Movie Teaser: యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. “కలి” మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. “కలి” మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు.

Also Read: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి భేటీ

ఇక ఈ మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో “కలి” టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

Also Read: Sai Dharam Tej: నటుడిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సాయి ధరంతేజ్.. స్పందించిన డిప్యూటీ సీఎం

చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు “కలి” మూవీ టీజర్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. కలి పాత్ర నేపథ్యంతో సాగే ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే “కలి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.డైరెక్టర్ శివ శేషు మాట్లాడుతూ “కలి” సినిమాను ఓ సరికొత్త కథాంశంతో రూపొందించాం. మైథాలజీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్స్ కలిపిన చిత్రమిది. “కలి” సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.