Kalatapaswi: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఈ నెల 2వ తేదీ లింగైక్యం చెందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు 15వ తేదీ ఫిల్మ్ నగర్ ఎఫ్.ఎన్.సి.సి.లో సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సన్నిహిత బంధువులు, సినీ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై, మరోసారి కె. విశ్వనాథ్ మృతికి నివాళులు అర్పించారు.
ఇదిలా ఉంటే… ఈ నెల 19వ తేదీ విశ్వనాథ్ గారి 94వ పుట్టిన రోజు. ఈ జయంతి కార్యక్రమాన్ని కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ‘కళాతపస్వికి కళాంజలి’ ఘటించబోతున్న ఈ కార్యక్రమంలో ఆయన చిత్రాలలో నటించిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాధిక, సుమలత తదితరులు పాల్గొనబోతుండటం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్టులు ఈ వేడుకకు విచ్చేసి, విశ్వనాథ్ గారితో తమకున్న అనుబంధాన్ని స్మరించుకోబోతున్నారు.
