Site icon NTV Telugu

HBD: తమ్ముడి గురించి కాలభైరవ ఎమోషనల్ ట్వీట్!

Kaala

Kaala

Srisimha: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి ఇద్దరు కొడుకులు. ఒకరు గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ కాగా, మరొకరు వర్థమాన కథానాయకుడు శ్రీసింహా! ఇవాళ శ్రీసింహా బర్త్ డే. అతను నటించిన పలు చిత్రాలకు కాలభైరవే సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘భాగ్ సాలే’కూ కాలభైరవ స్వరరచన చేస్తున్నాడు. శ్రీసింహా మరో సినిమా ‘ఉస్తాద్’తో పాటు ‘భాగ్ సాలే’ మూవీ నుండి కూడా అతని బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. ఇదే సమయంలో తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని కాలభైవర ఎమోషనల్ ట్వీట్ ద్వారా తెలిపాడు. “ఇవాళ నాకు ఎంతో ఇష్టమైన రోజు. నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్ పుట్టిన రోజు. నేను చేసే క్రైమ్ లో వాడు భాగస్వామి, నా బలం కూడా వాడే! నా నిధి, నా ఉత్సాహం, నా ఆనందం అన్నీ అతనే!!” అంటూ శ్రీసింహను భుజానికి ఎత్తుకున్న ఫోటోను కాలభైరవ పోస్ట్ చేశాడు.

Exit mobile version