Site icon NTV Telugu

Kajol : 26 ఏళ్ల తర్వాత.. మ్యారేజ్ లైఫ్ కి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి అంటున్న.. కాజోల్ 

Kajol

Kajol

బాలీవుడ్ నటి కాజోల్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “పెళ్లికీ ఒక ఎక్స్‌పైరీ డేట్‌, రెనివల్ ఆప్షన్ ఉండాలి” అని ఆమె చేసిన కామెంట్ నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె పెళ్లయి 26 సంవత్సరాలు అయిన తర్వాత ఈ మాటలు రావడం విశేషం. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌లో నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహం, సంతోషం, సంబంధాలు వంటి ఆసక్తికర అంశాలపై సరదాగా చర్చ సాగింది.

Also Read : Kodamasimham re-release : ‘కొదమసింహం’ ట్రైలర్‌ రిలీజ్‌తో ఫ్యాన్స్‌ ఫిదా..

ట్వింకిల్ ఖన్నా “వివాహానికి గడువు తేదీ, రెనివల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించగా, కృతి, విక్కీ, ట్వింకిల్ ‘నో’ చెప్పి రెడ్ జోన్‌లో నిలిచారు. కానీ కాజోల్ మాత్రం ఆ ఆలోచనకు మద్దతుగా గ్రీన్ జోన్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్వింకిల్ వెంటనే “అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!” అని చమత్కరించగా, కాజోల్ గంభీరంగా స్పందిస్తూ.. “నేను నిజంగానే అలా అనుకుంటున్నాను. మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే మనం ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే రెనివల్ ఆప్షన్ ఉంటే సంబంధానికి కొత్త అర్థం వస్తుంది.” అని చెప్పి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. తర్వాత ట్వింకిల్ మరో ఆసక్తికరమైన ప్రశ్న వేసింది — “డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా?” అని. దీనికి కాజోల్ ‘నో’ అనగా, ట్వింకిల్, విక్కీ ‘యెస్’ అన్నారు. కాజోల్ తన అభిప్రాయం చెబుతూ “డబ్బు ఎక్కువ ఉన్నా, అది కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండా చేస్తుంది’’ అని చెప్పింది.

గేమ్ చివర్లో ట్వింకిల్ సరదాగా “బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్‌లతో డేటింగ్ చేయకూడదు” అని చెబుతూ కాజోల్‌ను ఆటపట్టించింది. వెంటనే కాజోల్ నవ్వుతూ “నోరు మూయ్!” అంటూ సరదాగా మందలించింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ టాక్ షో లో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్, అలియా భట్ తదితరులు పాల్గొననున్నారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతుంది.

Exit mobile version