Site icon NTV Telugu

Kajol Devgan: కాజోల్ బోల్డ్ కామెంట్స్.. ఫిగర్ లేనివాళ్లు కూడా హీరోయిన్లు అవుతున్నారు

Kajol Devagan

Kajol Devagan

Bollywood Heroine Kajol Devgan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులో డైరెక్ట్ గా నటించకపోయినా డబ్బింగ్ సినిమాలుగా వచ్చిన మెరుపు కలలు, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, మొన్నీమధ్య వచ్చిన ధనుష్ విఐపి 2 చిత్రాలతో కాజోల్ తెలుగులోనూ సుపరిచితమే. ఇక స్టార్ హీరో అజయ్ దేవగణ్ భార్యగా కూడా అమ్మడు అందరికి తెలుసు. ప్రస్తుతం కాజోల్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లతో దూసుకుపోతోంది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓటిటీ చిత్రాలపై, ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

“ప్రస్తుతం ఓటిటీలో వస్తున్న కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. వెండితెరకు సమానంగా ఓటిటీ ఎదిగింది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఓటిటీ లో నటించే నటీనటులు ఎంతో ప్రతిభావంతులు. ఇక్కడ నటించే హీరోయిన్లకు 36-24- 36 కొలతలు ఉండాల్సిన అవసరం లేదు. ఫిగర్ లేనివాళ్లు కూడా హీరోయిన్లు అయిపోతున్నారు. స్టార్లుగా ఎదుగుతున్నారు. హీరోయిన్లే కాదు హీరోలకు కూడా సిక్స్ పాక్స్ చూపించనవసరం లేదు” అంటూ బోల్డ్ గా మాట్లాడేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటే కాజోల్ నటించే సమయంలో ప్రతి ఒక్కరు ఫిగర్ చూసేవారని, దాని కోసం వారు బాగా కష్టపడేవారని .. కానీ ఇప్పుడు కథను మాత్రమే చూడడం వలన హీరోహీరోయిన్లు ఎలా ఉన్నా ప్రాబ్లమ్ ఉండడం లేదని కొంచెం ఘాటుగా చెప్పుకొచ్చింది.

ఇక ఇలాంటి వ్యాఖ్యలే ఇటీవల హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా చెప్పుకొచ్చింది . ప్రస్తుతం హీరోయిన్లకు అన్ని పాత్రలు ఇస్తున్నారు.. కానీ ఒకప్పుడు రెండే పత్రాలు హీరోయిన్లకు ఉండేవి. సతి సావిత్రి పాత్రలు లేదా వ్యాంప్ పాత్రలు.. ఆ క్యారెక్టర్స్ చేసిన వారికి అలాంటి పాత్రలే వచ్చేవి అంటూ వాపోయింది. ఏదిఏమైనా చిత్ర పరిశ్రమలో వస్తున్న కొత్త మార్పులు మంచికే సంకేతం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Exit mobile version