కాజల్ ట్రెడిషనల్ లుక్ లో కవ్వించింది. స్లీవ్ లెస్ జాకెట్ మరియు డిజైనర్ శారీ ధరించిన కాజల్ అగర్వాల్ ఎంతో అందంగా ఉంది.. ఇప్పటికీ కాజల్ తన అందంతో అభిమానులను మైమరిపిస్తుంది.ఓ ప్రమోషనల్ షూట్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన అందాలతో రచ్చ చేసింది. కాజల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ఇటీవల ఆమెకు వివాహమై బిడ్డ కూడా జన్మించిన కానీ ఆమెకు డిమాండ్ అయితే తగ్గలేదు.లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. దర్శకుడు తేజా ఆమెను హీరోయిన్ గా లాంచ్ చేసారు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆకట్టుకోలేదు.. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో మొదటి విజయం అందుకుంది. మగధీర మూవీతో కాజల్ స్టార్ హీరోయిన్ గా మారింది.. మగధీర సినిమా కాజల్ కెరీర్ ను మార్చేసింది. ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్స్ వచ్చాయి. అక్కడ టాప్ స్టార్స్ పక్కన నటించింది.. బాలీవుడ్ లో కూడా ఆమె నటించింది.
స్టార్ హీరోయిన్ గా ఉండగానే కాజల్ వివాహం చేసుకున్నారు. 2020 అక్టోబర్ నెలలో కాజల్ తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు.ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేశారు. పెళ్ళికి ముందు ఒప్పుకున్న ఇండియన్ 2 మూవీ పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.కాజల్ చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ బాలయ్య తో చేస్తున్న భగవంత్ కేసరి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన కూడా చేశారు. కెరీర్లో ఫస్ట్ టైం బాలయ్యతో నటిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.. యంగ్ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్ర పోషిస్తుంది