NTV Telugu Site icon

Kajal: అసలే సమ్మర్.. ఈ హాటు ట్రీట్ తట్టుకోవడం ఎలా కాజల్?

Kajal

Kajal

Kajal Aggarwal Sizzling Photoshoot: లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో సినీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాదాపు చాలా మంది యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటించి మంచి క్రియేట్ సంపాదించింది. ఇక్కడ వరుస అవకాశాలు రావడంతో పాటు తమిళ సినీ పరిశ్రమలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక కొత్త హీరోయిన్ల ఎంట్రీతో అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ ని వివాహం చేసుకొని ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సరిగ్గా కరోనా లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న ఆమె లాక్ డౌన్ అంతా ముగించుకునే సరికి ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో అనుకుంటే మళ్ళీ యాక్టివ్ అవుతుంది.

Chay – Sobhita: మరోసారి హాట్ టాపిక్ గా చై-శోభిత.. ఇవి గమనించారా?

వరుస అవకాశాలు ఇప్పుడైతే లేవు కానీ ఆ అవకాశాల కోసం ఆమె చేస్తున్న హాట్ షో అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో వరుసగా హాట్ ఫోటోషూట్లు చేస్తూ వస్తున్న ఆమె తాజాగా వైట్ కలర్ లెహంగాలో మెరిసింది. ఆ ఫొటో షూట్ లో ప్రస్తుతానికి కాజల్ హీరోయిన్గా సత్యభామ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మే 17వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నికల హడావుడి ఉండడంతో కల్కీ లాంటి సినిమాలను వాయిదా వేసుకుంటున్న నేపద్యంలో చిన్న సినిమాగా చెబుతున్న ఈ సినిమా ఎలక్షన్స్ అయిన మొదటి శుక్రవారమే రిలీజ్ కి రెడీ అవ్వడం గమనార్హం. నిజానికి అదే రోజున విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే దాన్ని రిలీజ్ చేస్తారా వాయిదా వేస్తారా అనే విషయం మీద క్లారిటీ లేదు.

Show comments