సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ దంపతులు తమ మొదటి బిడ్డకు నీల్ కిచ్లు అనే పేరును పెట్టారు. ఇక తల్లయ్యాక కాజల్ ఇన్‌స్టాగ్రామ్ లో మొదటి పోస్ట్ చేసింది. అందులో తన ప్రసవానంతరం గ్లామర్ గా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అందంగా ఉంటుందంటూ రాసుకొచ్చింది. తన బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన అనుభవంపై సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది. “నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంది. మా ప్రసవం చాలా సంతోషకరమైనది, అఖండమైనది, సుదీర్ఘమైనది. అనిర్వచనీయమైన అనుభూతి… ఆ ఒక్క క్షణం నాకు ప్రేమ లోతెంతో తెలియజేసింది. బాధ్యతను గ్రహించాను” అంటూ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసింది. అంతేకాదు తాను ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో గోల్డ్ కలర్ డ్రెస్ లో తీసుకున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం నీల్ కిచ్లును చూడడానికి కాజల్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Read Also : Ghani : ‘ఆహా’లో ప్రొడ్యూసర్స్ కట్ వెర్షన్… వర్కౌట్ అవుతుందా ?
ఇదిలా ఉండగా కాజల్ ప్రెగ్నెన్సీ అనే విషయం తెలియగానే సినిమాల్లో నుంచి తప్పుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం
వరుస ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంది. కాగా కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లు 2020 అక్టోబర్ 30న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు కాజల్ హీరోయిన్ గా నటించిన “ఆచార్య” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 29న థియేటర్లలోకి రానుంది.
