Kajal Aggarwal In Chandramukhi 2: సూపర్‌స్టార్ రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘చంద్రముఖి’కి సీక్వెల్ రూపొందుతోన్న విషయం తెలిసిందే! కాకపోతే.. ప్రధాన పాత్రలో రజినీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. దర్శకుడు పి. వాసు తొలుత ఈ సీక్వెల్‌ను రజినీకాంత్‌తోనే చేయాలని ప్లాన్ చేశాడు కానీ, ఆయన నుంచి స్పందన రాకపోవడంతో లారెన్స్‌తో చేయడానికి సిద్ధమయ్యాడు. ఆల్రెడీ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడం, షూటింగ్ ప్రారంభించడం కూడా జరిగిపోయాయి. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని కూడా తెలిపారు. కానీ, టైటిల్ రోల్ ‘చంద్రముఖి’గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మాత్రం బయటకు రివీల్ చేయకుండా, సీక్రెట్‌గా మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు రివీల్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఆ పాత్రకు కావాల్సిన ప్రధాన కథానాయికను చిత్రబృందం దాదాపు ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ న్యూస్!
సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. చంద్రముఖి పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌ని మేకర్స్ సంప్రదించారట! గర్భవతి అయ్యాక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా రికవర్ అయ్యింది. యాడ్స్ కూడా చేస్తోంది. సినిమాల్లోకి పునరాగమనం ఇచ్చేందుకు సైతం సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. చంద్రముఖి రోల్‌లో కాజల్ సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతో, ఆమెని ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. కాజల్ కూడా, తనకు కంబ్యాక్ ఇచ్చేందుకు ఇదే సరైన ఆఫర్ అని భావించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం.. చారడేసి కళ్లున్న కాజల్, చంద్రముఖిగా బాగా చేస్తుందనడంలో సందేహమే లేదు. కాగా.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. తొలి పార్ట్ తరహాలోనే ఈ సినిమా ఆకట్టుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
