Site icon NTV Telugu

Kajal Aggarwal baby shower : పిక్స్ వైరల్

Kajal

త్వరలో తల్లి కాబోతున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 20న ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న కాజల్ బేబీ షవర్ చిత్రాలతో తన అభిమానులను ఆహ్లాదపరిచింది. ఫోటోలలో కాజల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు శ్రీమంతం వేడుకకు సంబంధించిన ఆచారాలు చేస్తూ కన్పించారు. కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ ను షేర్ చేసింది. ఆ ఫోటోలకు “గోద్‌భారై” అని క్యాప్షన్‌గా రాసింది. ఆమె ఈ ఫోటోలను పోస్ట్ చేయగానే అభిమానులు విషెస్ తో కాజల్ దంపతులను ముంచెత్తారు. ఈ జంట తమ ప్రెగ్నెన్సీ న్యూస్‌ను న్యూ ఇయర్‌ రోజు అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Read Also : BheemlaNayak : కార్లతో పవన్ ఫ్యాన్ రచ్చ… మెల్బోర్న్ లో జాతర షురూ

ఇక సినిమాల విషయానికొస్తే… కొరటాల ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్, చిరంజీవి, రామ్ చరణ్‌లతో కలిసి కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే ప్రత్యేక పాత్ర పోషించింది. ఇంకా బృందా రొమాంటిక్ డ్రామా “హే సినామిక”లో దుల్కర్ సల్మాన్ సరసన కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి రెండవ కథానాయికగా నటిస్తుంది. “హే సినామిక” ఈ ఏడాది మార్చి 3న థియేటర్లలోకి రానుంది.

Exit mobile version