Site icon NTV Telugu

Kajal Agarwal: భగవంత్ కేసరి సైకాలజీని స్టడీ చేస్తున్నట్లు ఉంది

Kajal Agarwal

Kajal Agarwal

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ సమయంలో సినిమా నుంచి బ్రేక్ తీసుకుంది. తన రీఎంట్రీ కోసం ఫాన్స్ ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కాజల్ అగర్వాల్, బాలయ్యతో జోడి కట్టిన సినిమా ‘భగవంత్ కేసరి’. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. నందమూరి అభిమానులకే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కి కూడా భగవంత్ కేసరిగా బాలయ్య తెగ నచ్చేసాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. దీంతో భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు పెరిగాయి.

అక్టోబర్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో కాజల్ తో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది. ఈరోజు కాజల్ అగర్వాల్ బర్త్ డే కావడంతో, భగవంత్ కేసరి చిత్ర యూనిట్ నుంచి కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే కాజల్ ఈ పోస్టర్ లో బ్యూటిఫుల్ గా కనిపించింది. పోస్టర్ లో కాజల్ సైకాలజీ బుక్ చదువుతున్నట్లు కనిపించింది. ఆమె రూమ్ మొత్తం బుక్స్ తోనే నిండి ఉన్నాయి కాబట్టి ఆమె డాక్టర్ కానీ లాయర్ కానీ అయ్యే అవకాశం ఉంది. బాలయ్య సైకాలజీని చదివే డాక్టర్ గా కాజల్ కనిపిస్తుందేమో చూడాలి. ఇన్నేళ్ల కెరీర్ లో కాజల్ అగర్వాల్ బాలయ్యతో జతకట్టడం ఇదే మొదటిసారి. మరి ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ సాలిడ్ రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version