Site icon NTV Telugu

Kajal Agarwal : తన కొత్త సినిమాను అనౌన్స్ చేసిన కాజల్ అగర్వాల్…

Whatsapp Image 2023 06 17 At 5.35.03 Pm

Whatsapp Image 2023 06 17 At 5.35.03 Pm

తెలుగు లో కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. చందమామ సినిమా లో తన అద్భుతమైన నటనతో అందరిని అలరించింది. ఆ చిత్రం తరువాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస గా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ చందమామ సినిమాల కు దూరమైంది. తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్. ఆమె కు బాబు జన్మించాక సినీ పరిశ్రమకు కొంతకాలం దూరంగా ఉంది. ఇక ఈ బ్యూటీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి చిత్రంలోనూ హీరోయిన్ గా నటించనుంది. అయితే కాజల్ లకు గుడ్ బై చెప్పేస్తుందని తన కొడుకుతో పూర్తి సమయాన్ని గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల కాజల్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ కూడా ఈ వార్తలు నిజం అనుకునేలా చేసాయి.. దీంతో కాజల్ నిజాంగానే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు అనుకున్నారు అంతా.ఈ క్రమంలో తాజాగా కొత్త సినిమాను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది.

కాజల్ తన కెరీర్ లో 60వ సినిమా గా రాబోతున్న ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీ టైటిల్ మరియు టీజర్ ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అందులో కారు విండో నుంచి కాజల్ గాజులు ధరించిన చేయి బయటపెట్టగా కార్ అద్దంలో కాజల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని లుక్ లో కాజల్ ను చూపిస్తున్నాం అంటూ అనౌన్స్ చేసిన పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఔరం ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారని సమాచారం.. ఇక ఈ సినిమా డైరెక్టర్ అలాగే ఇతర నటీనటుల గురించి త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారు.

Exit mobile version