తమిళ నటుడు కార్తీ హీరోగా, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ డ్రామా ‘ఖైదీ’.. ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసు, నేరగాళ్ల మధ్య నడిచే ఉత్కంఠభరితమైన కధనం, హీరోకి లవ్ ట్రాక్ లేకుండానే పూర్తిగా రాత్రి సమయంలో నడిచే కథగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. 2019లో విడుదలైన ఈ సినిమా కేవలం తమిళ్ లో కాకుండా, డబ్బింగ్ ద్వారా తెలుగు సహా పలు భాషల్లో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే విజయం మాలే భాషలో పునరావృతం కానుంది.
Also Read : OG : ‘ఓజి’ ట్రైలర్ ఆ రోజేనా?
మలేషియా అధికారిక భాషలో రూపొందుతున్న ఈ రీమేక్‌కు ‘బందువన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని క్రోల్ ఆజ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా ఆరోజ్ అజిజ్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్ చూస్తే, అసలు చిత్రానికి న్యాయం చేస్తూ, స్థానిక ప్రేక్షకుల రుచి, నేటివ్ టచ్‌కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా హీరో మాస్ లుక్, చీకటిలో సాగే యాక్షన్ సీన్లు, టెన్షన్ క్రియేట్ చేసే బి.జి.ఎం. ఈ రీమేక్ కూడా మంచి స్థాయిలో దృష్టిని ఆకర్షించబోతోందనిపిస్తోంది. కాగా ఈ ‘బందువన్’ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రీమేక్ విజయవంతమైతే, లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ’ బ్రాండ్ మరింత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
