NTV Telugu Site icon

Prithviraj Sukumaran: ఐదు భాషల్లో రాబోతున్న ‘కడువా’!

New Project (78)

New Project (78)

 

పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు షాజీ కైలాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోంది మలయాళ చిత్రం ‘కడువా’. ఈ హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ ను పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల చేయాలని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ భావిస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. అలానే ‘భీమ్లా నాయక్’ తో తెలుగువారికీ సుపరిచితురాలైన సంయుక్త మీనన్ ఇందులో నాయికగా నటించింది. మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు.