Actress Murdered: మందుకు డబ్బివ్వలేదని కొడుకు చేతిలో నటి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadaisi Vivasayi actor Kasiammal killed by her alcoholic son: తమిళనాడుకు చెందిన తమిళనాడు కాశీ అమ్మాళ్ తన సొంత కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 74 సంవత్సరాల వయసున్న ఆమె కడాయిసి వివసాయి (చివరి వ్యవసాయదారుడు) సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఓటీటీలో రిలీజ్ కాగా మంచి టాక్ వచ్చింది. అయితే అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 4వ తేదీ అంటే గత ఆదివారం నాడు ఆమె మద్యానికి బానిసైన తన కుమారుడు మద్యం తాగడానికి డబ్బు అడిగితే ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఒక బలమైన చెక్కతో ఆమె మీద దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో ఆమె చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
Lal Salaam: సౌండ్ లేకుండా దిగుతున్న రజనీకాంత్ సినిమా
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
ఆమె కుమారుడు నమ్మకోడి ఆమెను ముందు డబ్బు కోసం ఇబ్బంది పెట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతసేపటికి డబ్బు ఇవ్వడం లేదు అనే కారణంతో ఆమె మీద చెక్కతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి దాడి చేసిన చెక్క పలకను స్వాధీనం చేసుకుని 51 ఏళ్ల నమ్మకోడిపై కేసు నమోదు చేశారు. అతని మీద ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మర్డర్ కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అతని మద్యం అలవాటు వల్ల భార్య అతని వదిలేసిందని కూడా చెబుతున్నారు. ఇక మణికందన్ దర్శకత్వంలో తెరకెక్కిన కడాయిసి వివసాయి సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో కాశి అమ్మాళ్ సరసన నటించిన నల్లింది అనే వ్యక్తికి 69వ నేషనల్ అవార్డ్స్ లో స్పెషల్ మెన్షన్ అవార్డు కూడా వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ అవడాని కంటే ముందే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఓటీటీ ద్వారా తెలుగు వారికి కూడా సుపరిచితమే.
తాజావార్తలు
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!