Kadaisi Vivasayi actor Kasiammal killed by her alcoholic son: తమిళనాడుకు చెందిన తమిళనాడు కాశీ అమ్మాళ్ తన సొంత కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 74 సంవత్సరాల వయసున్న ఆమె కడాయిసి వివసాయి (చివరి వ్యవసాయదారుడు) సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఓటీటీలో రిలీజ్ కాగా మంచి టాక్ వచ్చింది. అయితే అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 4వ తేదీ అంటే గత ఆదివారం నాడు ఆమె మద్యానికి బానిసైన తన కుమారుడు మద్యం తాగడానికి డబ్బు అడిగితే ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఒక బలమైన చెక్కతో ఆమె మీద దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో ఆమె చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
Lal Salaam: సౌండ్ లేకుండా దిగుతున్న రజనీకాంత్ సినిమా
ఆమె కుమారుడు నమ్మకోడి ఆమెను ముందు డబ్బు కోసం ఇబ్బంది పెట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతసేపటికి డబ్బు ఇవ్వడం లేదు అనే కారణంతో ఆమె మీద చెక్కతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి దాడి చేసిన చెక్క పలకను స్వాధీనం చేసుకుని 51 ఏళ్ల నమ్మకోడిపై కేసు నమోదు చేశారు. అతని మీద ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మర్డర్ కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అతని మద్యం అలవాటు వల్ల భార్య అతని వదిలేసిందని కూడా చెబుతున్నారు. ఇక మణికందన్ దర్శకత్వంలో తెరకెక్కిన కడాయిసి వివసాయి సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో కాశి అమ్మాళ్ సరసన నటించిన నల్లింది అనే వ్యక్తికి 69వ నేషనల్ అవార్డ్స్ లో స్పెషల్ మెన్షన్ అవార్డు కూడా వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ అవడాని కంటే ముందే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఓటీటీ ద్వారా తెలుగు వారికి కూడా సుపరిచితమే.