K Viswanath Wife Jayalakshmi Died: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి(86) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడం మొదలుపెట్టారు. అయితే.. చికిత్స పొందుతూ ఆమె కాసేపటికే కన్నుమూశారు. కే. విశ్వనాథ్ కన్నుమూసిన 24 రోజులకే ఆయన భార్య జయలక్ష్మి మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
K Jayalakshmi: కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

K Viswanath Wife Died