K.Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన ఇచ్చినన్ని హిట్లు మరే దర్శకుడు ఇవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్- రాఘవేంద్ర రావు కాంబో అంటే .. హిట్ పడాల్సిందే. వారిద్దరి సినిమా వస్తుంది అంటే మిగతా సినిమాల రిలీజ్ ను కూడా ఆపేసుకొనేవారట మిగతా నిర్మాతలు. ఇక దర్శకేంద్రుడుకి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో అందరికి తెల్సిందే. ఎన్నోసార్లు ఆయన ఎన్టీఆర్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను పంచుకున్నారు. ఇక తాజాగా దర్శకేంద్రుడు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. నిన్ననే ఎన్టీఆర్ ను గౌరవిస్తూ ఆయన ఫొటోతో రూ 100 నాణేన్ని రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీనియర్ ఎన్టీఆర్ స్మారక చిహ్నంగా నాణెం ను విడుదల చేయడం పట్ల నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయమై దర్శకేంద్రుడు స్పందించాడు.
Kushi: ఖుషీ సమంత రియల్ లైఫ్ స్టోరీనా.. శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్?
“నాకు దైవ సమానులైన నందమూరి తారక రామారావు పేరుతో వంద రూపాయల కాయిన్ ను భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తరువాత.. త్వరలోనే ఆయనకు భారతరత్న బిరుదును కూడా భారత ప్రభుత్వం ఇస్తే తెలుగుజాతి నిజంగా గర్వించదగే రోజు అవుతుంది. ఆ పనిని కూడా అందరు పూనుకొని చేస్తారని మనసారా నమ్ముతూ.. మీ రాఘవేంద్రరావు” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
We Demand Bharat Ratna for NTR Garu#bharatrathna #ntr pic.twitter.com/r9k06SGSvL
— Raghavendra Rao K (@Ragavendraraoba) August 29, 2023