NTV Telugu Site icon

Jyothika: తమిళ రాక్షసి తెలుగులోకి వచ్చేస్తోంది.. అమ్మ ఒడి అంటోన్న జ్యోతిక

Jyothika Amma Vodi

Jyothika Amma Vodi

Jyothika Amma Vodi Trailer: జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం రాక్షసి ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో అమ్మ ఒడి టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వడ్డీ రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సోమవారం నాడు తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ గా జ్యోతిక కనిపిస్తున్నారు. పాడైపోయిన స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.

Rajendra Prasad: పెళ్లిపుస్తకం రాసేశాం.. ఇక ఇప్పుడు లగ్గం!

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తి పెంచుతుంది. ఇక ఈ సినిమాలో నాగినీడు, హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మాట్లాడుతూ..”తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది, తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను చూపించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ రాజ్ అద్భుతంగా రూపొందించారు, డబ్బింగ్ – సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని అన్నారు.

Show comments