Rajendra Prasad: పెళ్లిపుస్తకం రాసేశాం.. ఇక ఇప్పుడు లగ్గం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laggam Movie Opening: సుభిశి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బేవార్స్, భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యిన సందర్భంగా డా . రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్ లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి, “లగ్గం విందు భోజనం” లాంటి సినిమా అన్నారు. ఇక దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ “పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు!! రెండు మనసులు కలవడం.” అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నామన్నారు.
Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమా అందుకే తేడాకొట్టింది!.. ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్
Also Read
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
- Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా బేబీ కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి 5నుండి పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్గాన్ని గుర్తుచేస్తుందని, పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది అని హీరో సాయి రోనక్ అన్నారు. రోహిణి,సప్తగిరి, ఎల్ బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న , తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!