Site icon NTV Telugu

Nani: మొన్న అయాన్.. నేడు జున్ను.. టాలెంటెడ్ నెపో కిడ్స్ రా మావా..

Nni

Nni

Nani: జనరేషన్ మారుతోంది.. టెక్నాలజీ పెరుగుతుంది. ఇపుడున్న జనరేషన్ కిడ్స్ మాములుగా లేరు. కేవలం 5 ఏళ్ళు తిరగకుండానే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అదే అప్పట్లో కిడ్స్ అయితే.. ఇంకా స్కూల్ కి వెళ్ళను అంటూ మారాం చేస్తూనే ఉండేవాళ్లు. ఇప్పుడు కిడ్స్.. చిన్న వయస్సులోనే చదువు తో పాటు డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్, రీల్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇక సెలబ్రిటీల పిల్లలు దానికి అతీతులేం కాదు. ఇప్పుడున్న స్టార్ కిడ్స్ టాలెంట్ చూసి అభిమానులు కూడా నోరు వెళ్లబెడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార.. 11 ఏళ్లకే మోడల్ గా ఒక యాడ్ చేసింది. ఇంకోపక్క పవన్ కొడుకు అకీరా.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్య అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్.. లుట్ ఫుట్ గయా అంటూ షారుఖ్ నే ఫిదా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ కిడ్స్ చిన్నతనం నుంచే తమ సొంత టాలెంట్ తో పైకి ఎదుగుతున్నారు.

తాజాగా వీరి లిస్ట్ లోకి చేరిపోయాడు న్యాచురల్ స్టార్ నాని కొడుకు జున్ను. 2012 లో నాని, అంజనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ముద్దుల కొడుకు అర్జున్.. ముద్దుపేరు జున్ను. ప్రస్తుతం జున్నుకు ఏడేళ్లు. మొదటి నుంచి కూడా జున్నుకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేయడంతో అతను ఇప్పుడు పియానో నేర్చుకుంటున్నాడు. ఇక మొన్న నాని పుట్టినరోజు కావడంతో జున్ను.. తండ్రికి ఒక అద్భుతమైన గిఫ్ట్ అందించాడు. తండ్రి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని హొయనా.. హొయనా సాంగ్ ను పియానో మీద ప్లే చేసి తండ్రికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక జున్ను ఇచ్చిన సర్ ప్రైజ్ కు నాని మురిసిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు టాలెంటెడ్ నెపో కిడ్స్ రా మావా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version