Site icon NTV Telugu

NTR: ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. విషాదంలో ఫ్యాన్స్

Ntr

Ntr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఎన్టీఆర్ సైతం అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం చోటుచేసుకుంది. తారక్ వీరాభిమాని చిన్న వయస్సులోనే మృతి చెందాడు. అయితే అతను ఎలా మృతి చెందాడు అనే డీటైల్స్ తెలియవు కానీ, అతని మృతిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అతని పేరు శ్యామ్ అని తెలుస్తోంది. హీరో విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజి మీద ఎన్టీఆర్ ను హత్తుకున్న కుర్రాడు శ్యామ్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే శ్యామ్ కు ప్రాణం అంట. ఎక్కడ ఎన్టీఆర్ ఈవెంట్ జరిగినా ముందు ఉండి అన్ని పనులు చేయడంతో పాటు అన్ని విషయాల్లో తారక్ పేరును నిలబెట్టేలా మంచి పనులు కూడా చేసేవాడట.
Pawan Kalyan: వింటేజ్ పవన్.. నాలుగు గెటప్ లతో ‘బ్రో’ ఆగమనం..?

ఇక అతి చిన్న వయస్సులోనే అతను మృతి చెందడం తో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చివరి కోరిక తీర్చుకొని వెళ్ళిపోయాడు అని మాత్రం ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ప్రతి అభిమానికి తమ అభిమాన హీరోను కలవడమే బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ గా ఫీల్ అవుతారు. శ్యామ్ సైతం ఎన్టీఆర్ ను కలిసి, ఫోటో దిగిన రోజు అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయంట.. ముందు ముందు శ్యామ్ ఎన్టీఆర్ ను కలుస్తూ ఉంటాడు అనుకున్నాం కానీ, ఇలా ఎప్పటికి కలవలేని ఫోటోలా మిగిలిపోతాడు అని అనుకోలేదని అతని ఫ్రెండ్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version