Site icon NTV Telugu

ఈవెంట్‌ మేనేజర్‌ ఆత్మహత్య… వెలుగులోకి షాకింగ్ నిజాలు

Junior Artist Anuradha Suicide at Film Nagar

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఈవెంట్‌ మేనేజర్‌ అనురాధ ఆత్మహత్య చేసుకుంది.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆమె.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. బంజారాహిల్స్ పీఎస్‌ పరిధిలోని ఫిల్మ్‌నగర్‌ జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో నివాసం ఉంటున్న ఈవెంట్‌ మేనేజర్‌ అనురాధకి.. కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా కిరణ్‌ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన ఆమె.. ఆ యువకుడితో సహజీవనం చేస్తోంది.. కానీ, ఇటీవలే మరో యువతితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం ఆమెకు తెలియడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది.

Read Also : భారీగా డ్రగ్స్ తో పట్టుబడిన ‘సింగం’ నటుడు

ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి.. ఆమెను వదిలించుకోవాలని భావించిన కిరణ్‌.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన జూనియర్‌ ఆర్టిస్ట్ అనురాధ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.. అమె గది నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. కుళ్లిపోయిన స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న అనురాధ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Exit mobile version