మరికొద్ది రోజుల్లో వార్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్క్వైర్ ఇండియా అనే ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను జూనియర్ ఎన్టీఆర్ పంచుకున్నాడు. తాజాగా డబ్బు గురించి, ఫేమ్ గురించి మాట్లాడుతూ ఒక మనిషి ఎలా కనిపిస్తాడు, అతని నుంచి ఎలాంటి స్మెల్ వస్తుంది, అతను ఏం బట్టలు ధరిస్తాడు అనేది అసలు మ్యాటర్ ఏ కాదు, అతని లోపల ఏముంది అనేది ముఖ్యం.
Also Read:Balakrishna: బాలయ్యతో నిర్మాతల భేటీ.. కీలక సూచనలు!
ఏదైతే అతన్ని క్యారెక్టర్ డిసైడ్ చేస్తుందో అదే ఇంపార్టెంట్. నా విషయానికి వచ్చేసరికి ఒక మనిషిలో హానెస్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఒక వ్యక్తి తన పవర్ ఎంత ఉందో తాను ఎస్టిమేట్ చేసుకునే దానికన్నా ఒక స్త్రీ అతని గురించి ఎస్టిమేట్ చేసేది చాలా కరెక్ట్. దానికోసం అతను పవర్‌ఫుల్‌గా కనిపించడం లేదా మగాడిని అనిపించేలా కనిపించాల్సినంత అవసరం లేదు అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. దేవర పార్ట్ వన్ అసంపూర్తిగా వదిలేసిన నేపథ్యంలో దేవర 2 ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
