NTV Telugu Site icon

Tillu Square: టిల్లు గాడి కోసం మొన్న మెగాస్టార్ ఇప్పుడు ఎన్టీఆర్

Jr Ntr Siddhu Jonnalagadda

Jr Ntr Siddhu Jonnalagadda

Jr NTR to grace the success meet of Tillu Square Soon: 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా విమల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కాదు వసూళ్లు కూడా గట్టిగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో ఒక సినిమా తెరకెక్కించి ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాకి కూడా సిద్దు జొన్నలగడ్డ కథ అందించగా మల్లిక్ రామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి కూడా వసూళ్లు గట్టిగా వస్తున్నాయి. 100 కోట్ల టార్గెట్తో ఈ సినిమా దూసుకుపోతోంది.

Teja Sajja: తేజా సెలెక్షన్ మాములుగా లేదుగా.. కొత్త సినిమా హీరోయిన్ ఇదిగో..

ఇప్పటికే ఈ సినిమా బాగుంది అంటూ సినిమా యూనిట్ మొత్తాన్ని పిలిపించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించగా ఇప్పుడు ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ లో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు సిద్దు జొన్నలగడ్డతో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు దిగినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే సమయంలో విశ్వక్సేన్ కూడా అదే ప్లేస్ లో ఉండగా ఆయనతో కూడా ఎన్టీఆర్ ఫోటోలు దిగారు. అలాగే ఈ సినిమా నిర్మాణ సంస్థ సితార బ్యానర్ నిర్మాణ అధిపతి నాగవంశీతో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద మొన్న టిల్లు గాడి కోసం మెగాస్టార్ ఇప్పుడు ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.

Show comments