కొన్ని రోజుల క్రితం “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్ర బృందంతో కలిసి ఉక్రెయిన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1న రామ్ చరణ్, “ఆర్ఆర్ఆర్” బృందంతో కలిసి తారక్ ఉక్రెయిన్ వెళ్లాడు. ఉక్రెయిన్‌లో 15 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఉక్రెయిన్‌లో ఎస్ఎస్ రాజమౌళి ఒక సాంగ్ ను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తన పార్ట్ షూట్‌ను ఉక్రెయిన్‌లో పూర్తి చేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించాడు. ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్లటి టోపీ, మాస్క్, తెల్లటి టీ షర్టు, నీలిరంగు జీన్స్ ధరించి క్యాజువల్ లుక్‌లో కనిపించాడు.
Read Also : దాసరి కుమారుడిపై అట్రాసిటీ కేసు…
మరోవైపు రీసెంట్ గా ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఒక వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కారులో “దోస్తీ” పాట వింటూ కన్పించారు. ఇలాగే మరికొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేశాడు ఎన్టీఆర్. అక్టోబర్ 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”లో ఒలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగన్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.
