NTV Telugu Site icon

Simhadri: ఒక్క రోజులోనే అన్ని రికార్డులని లేపేసారా?

Simhadri 4k

Simhadri 4k

100 రోజులు 150 సెంటర్స్ లో ఆడిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సింహాద్రి’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన సినిమా ‘సింహాద్రి’. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ఉన్న ఈ మూవీకి ఇప్పుడు నాన్-సింహాద్రి రీరిలీజ్ రికార్డ్స్ అనే స్టేటస్ ఇస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమా రీరిలీజ్ అయ్యింది. రీరిలీజ్ అంటే ఈ మధ్య రెగ్యులర్ గా జరుగుతున్నట్లు కాదు అది ఇంకో రకం అన్నట్లు ఇప్పటివరకూ ఏ రీరిలీజ్ మూవీకి జరగని విధంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ తో సింహాద్రి రీరిలీజ్ అయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా సింహాద్రి సినిమా 1200కి పైగా సెంటర్స్ లో రిలీజ్ అయ్యింది అంటే ఫాన్స్ ఏ రేంజ్ హంగామా చేసారో అర్ధం చేసుకోవచ్చు. మే 19 సాయంత్రం నుంచే సింహాద్రి రీరిలీజ్ షోస్ అన్ని సెంటర్స్ లో పడ్డాయి. ఈ రీరిలీజ్ కి ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన సెలబ్రేషన్స్ చూస్తే ఒక కొత్త సినిమా విడుదల సమయంలో కూడా ఈ రేంజ్ హంగామా చెయ్యరు కదా అనిపించకమానదు. రీరిలీజ్ ట్రెండ్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని బెంచ్ మార్క్ గా సెట్ చేసారు ఎన్టీఆర్ ఫాన్స్. సింహాద్రి సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 5 కోట్లకి పైగా రాబట్టిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న టయర్ 2 హీరోల కొత్త సినిమాల డే 1 కలెక్షన్స్ కన్నా ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఫాన్స్ సర్క్యులేట్ చేస్తున్న 5.2 కోట్లు అనేది నిజమైతే ఎన్టీఆర్ ఫాన్స్ కొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే రీరిలీజ్ ట్రెండ్ లో టాప్ ప్లేస్ లో ఖుషి సినిమా ఉంది. ఈ మూవీ 4.15 కోట్లని రాబట్టింది, ఖుషి తర్వాతి స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమానే ఉంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సా సినిమా 3 కోట్లా 20 లక్షలతో సెకండ్ ప్లేస్ లో ఉంది.  తర్వాతి స్థానాల్లో మహేష్ ఒక్కడు, పోకిరి… రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సింహాద్రి హ్యూజ్ మార్జిన్ తో టాప్ ప్లేస్ లో నిలిచిందని ఫాన్స్ సందడి చేస్తున్నారు. అఫీషియల్ ఫిగర్స్ తెలియాల్సి ఉంది.

Show comments