NTV Telugu Site icon

Devara: ఇది కదా ఫాన్స్ కి కావాల్సింది.. దేవరా!!

Devara

Devara

Jr NTR Planning for Pan India Image with Devara: జూనియర్ ఎన్టీఆర్ మనకు ఎప్పటినుంచో పరిచయమే కానీ ఆయననని RRR ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఆ సినిమాతో అందుకున్న సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ తన రాబోయే సినిమాలతో పాన్-ఇండియన్ ఇమేజ్‌ని కొనసాగాలించాలని ఆసక్తి చూపిస్తున్నాడు. RRR తరువాత దేవర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకుడు కాగా, జాన్వీ కపూర్ కథానాయిక. ఈరోజు ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన స్టార్ క్యాస్ట్ తో పాటు కౄ కూడా హాజరుకానున్నారు. ట్రైలర్ లాంచ్‌కు ముందే ఎన్టీఆర్ ముంబైకి వెళ్లాడు. పక్కాగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు అన్ని ప్రఖ్యాత మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు.

Kamal Haasan : ఈ వయసులో క్లాసులకు వెళ్తున్న కమల్.. ఎందుకో తెలుసా?

ఎన్టీఆర్ మరో రెండు రోజులు ముంబైలో ఉండి మొత్తం గట్టిగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. నిన్నటి నుంచే చాలా ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు. ఇప్పటికే కపిల్ శర్మ షో కోసం షూటింగ్ పూర్తి చేయగా ఈ ఉదయం కరణ్ జోహార్, అలియా భట్ తో ఒక ఇంటర్వ్యూ అయింది. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ కోసం కూడా షూట్ చేశాడని ఊహాగానాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌కి హృతిక్ రోషన్‌తో పాటు వార్ 2 కూడా ఉంది ఇది ఇండియన్ సినిమాస్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందని చెప్పొచ్చు. వార్ 2 విడుదలకు ముందే, ఎన్టీఆర్ దేవరతో పాన్-ఇండియన్ ఇమేజ్‌ను సాధించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇది తారక్ టీం చేస్తున్న ఒక మంచి ప్లానింగ్ అని చెప్పొచ్చు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ దేవర సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందించారు.

Show comments