Site icon NTV Telugu

అఖండ సినిమాపై తారక్ స్పందన.. బాల బాబాయ్.. కంగ్రాట్స్

akhanda

akhanda

నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. సింహ, లెజెండ్ చిత్రాల తరువాత వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అంచనాలను మించి నేడు విడుదలైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని కలక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత అఖండ తో థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇక అఖండ భారీ విజయాన్ని అటు అభిమానులే కాకుండా ఇటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి పలువురు స్టార్ హీరోలు అఖండ సినిమా హిట్ కొట్టడంతో బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

తాజగా జూ. ఎన్టీఆర్ అఖండ చిత్రాన్ని వీక్షించి ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలిపారు. ” ఇప్పుడే అఖండ మూవీ చూసాను.. కంగ్రాట్స్ బాల బాబాయ్ .. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్ర బృందానికి అబినందనలు .. ఎంతోమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఆనంద క్షణాలు ఇవి” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. బాబాయ్ సినిమాకు అబ్బాయి అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు.. అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలాగూ రాలేదు.. కనీసం సక్సెస్ మీట్ కైనా వస్తే బావుంటుందని, ఒకే వేదికపై బాబాయ్- అబ్బాయ్ సందడి చేస్తే బావుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.

Exit mobile version