NTR Viral Tweet: సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన అభిమానితో జరిపిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాయితేజ్ అనే ఒక అభిమాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ.. “అన్న, మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.. వారికి రెండు కుకీలు పంపించు” అంటూ సరదాగా ఒక పోస్ట్ పెట్టాడు. సాధారణంగా ఇలాంటి ట్వీట్లకు సెలబ్రిటీలు స్పందించడం చాలా అరుదు, కానీ తన అభిమానుల పట్ల ఎప్పుడూ ప్రత్యేకమైన చొరవ చూపే తారక్ ఈ ట్వీట్‌పై స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
— Jr NTR (@tarak9999) June 5, 2026
అభిమాని అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ తనదైన శైలిలో నవ్వులు పూయించేలా రిప్లై ఇచ్చారు. ప్రముఖ మీమ్ టెంప్లేట్ అయిన “అడ్రస్ పెట్టు ముందు అడ్రస్ పెట్టు” అనే ఫన్నీ మీమ్ ను షేర్ చేస్తూ తారక్ రిప్లై ఇచ్చారు. దీనితో ఈ క్రేజీ రిప్లై చూసిన నందమూరి అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘అన్న మామూలోడు కాదు’, ‘తారక్ టైమింగ్ అద్భుతం’ అంటూ ఈ ట్వీట్‌ను విపరీతంగా లైకులు, షేర్లతో వైరల్ చేస్తున్నారు.

