Site icon NTV Telugu

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?

Jrntr

Jrntr

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2 సినిమా జోష్ లో ఉన్నాడు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. ఇందులో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మీదనే చర్చ నడుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సెకండ్ హీరో, విలన్ అంటూ జరిగిన ప్రచారం నిజం కాకపోయినా.. హృతిక్ పక్కన ఎన్టీఆర్ ను పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలెట్టేశారు యాంటీ ఫ్యాన్స్. హృతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్, గ్లామర్ తో ఎన్టీఆర్ ను పోలుస్తున్నారు.

Read Also : Udaya Bhanu : వాళ్ల బండారం బయటపెడుతా.. యాంకర్లపై ఫైర్

వాస్తవానికి ఎన్టీఆర్ గొప్ప నటుడు. వార్-2లో ఎన్టీఆర్ పాత్రకే నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. మూడు షేడ్స్ ఉండే పాత్ర. కానీ స్క్రీన్ ప్రజెన్స్ కు వస్తే హృతిక్ హైలెట్ అవుతున్నాడు. వీరిద్దరూ కలిసి కనిపించే ప్రతి సీన్ లో హృతిక్ హైలెట్ అవుతున్నాడు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. ఇక నుంచి ఎన్టీఆర్ ఇలా మల్టీస్టారర్ సినిమాల్లో కనిపించకపోవడం బెటర్ అంటున్నారు. ఎందుకంటే ఇలా అనవసరంగా నటించి లేనిపోని ట్రోల్స్ కు, నెగెటివ్ ఇంపాక్ట్ కు గురయ్యే బదులు.. తనకు వచ్చే పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటే చాలు అంటున్నారు ఆయన అభిమానులు. కాబట్టి ఇక నుంచి మల్టీ స్టారర్ సినిమాలు చేసి తనను తాను తగ్గించుకోవడం కంటే తన ఫ్యాన్ బేస్ కు తగ్గట్టు సింగిల్ గానే భారీ సినిమాలు చేయాలంటున్నారు అభిమానులు.

Read Also : Raj Kundra : నా కిడ్నీ స్వామీజీకి ఇస్తా.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్

Exit mobile version