తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పొలిటికల్ క్లైమేట్ ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, తెలుగు తమ్ముళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం… ఇలా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రామా నడుస్తోంది. ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదంటూ నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ పై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అయినా స్పందించాలి అంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దుబాయ్ వెళ్ళాడు.
దేవర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్… 2023 సైమా ఈవెంట్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అడ్రెస్ చెప్తూ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు డై హార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎమోషనల్ చేస్తుంది. తన ప్రతి కష్టం సుఖంలో ఉండి… తనతో పాటే సాగుతున్న అభిమానులని ఉద్దేశించి ఎన్టీఆర్ “నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడెళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు” అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. నిజానికి ఎన్టీఆర్ తన ప్రతి స్పీచ్ లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల రీత్యా ఎన్టీఆర్ స్పీచ్ చాలా స్పెషల్ గా నిలిచింది.
