NTV Telugu Site icon

Joju George: పాన్ ఇండియా మూవీగా జోజు జార్జ్ ”ఆంటోని”.. దసరాకి స్పెషల్ ట్రీట్!

Antony Teaser

Antony Teaser

Joshiy -Joju George ‘Antony’ Teaser to be Unveiled on October 19th : పలు మలయాళ సినిమాలతో జోజు జార్జ్ తెలుగు వారికి సైతం దగ్గరయ్యాడు. నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా ఆయన చేసిన పలు మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అలా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో ఆంటోని అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నవంబర్ 23న విడుదల కాబోతోంది. ఎయిన్స్టిన్ మీడియా, నెస్ట్లల్ స్టూడియో & అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై జోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శన్ , చెంబన్ వినోద్ జోష్, నైలా ఉష ప్రధాన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు జోషి దర్శకుడు కాగా ఎయిన్స్టిన్ జాక్ పాల్ నిర్మాతగా వ్యవహరించారు.

Extraordinary Man :డిసెంబర్ బాక్సాఫీస్ క్లాష్లోకి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఆరోజే రిలీజ్

బ్లడ్ రిలేషన్స్ తో కూడిన ఎమోషనల్ జర్నీ ఆంటోని అని చెబుతూ ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా నుంచి టీజర్ ను దసరా సంధర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో జోజు జార్జ్ మాట్లాడుతూ గతంలో నేను దర్శకుడు జోషి దర్శకత్వంలో చేసిన పోరింజు మరియం జోస్ నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది, ఆంటోని సినిమా కూడా అదే తరహాలో విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. ఇక ఈ సినిమాకు జెక్స్ బెజాయ్ సంగీతం అందించగా రెనాడివ్ సినిమాటోగ్రఫీ అందించారు.

Show comments