Joker 2: రిలీజ్ ట్రైలర్ రెడీ అవుతోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘జోకర్’ సినిమా 2019లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ లో జోకర్ సినిమా వన్ బిలియన్ డాలర్స్ రాబట్టి వరల్డ్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన టాడ్ ఫిలిప్స్ గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. ‘జోకర్’ జియోక్విన్ ఫీనిక్స్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి క్విన్‌గా ‘లేడీ గాగా’ ఫస్ట్ లుక్ ని టాడ్ ఫిలిప్స్ రిలీజ్ చేశాడు. డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ అప్‌లోడ్ చేసిన ఫోటోలో జోక్విన్ ఫీనిక్స్ ప్లే చేసిన ‘జోకర్’తో పాటు గాగా ఒక వాల్ కి ఆనుకుని నిలబడి ఉంది. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ, ఫిలిప్స్ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
దర్శకుడు ఫిలిప్స్, లేడీ గాగాతో కలిసి పనిచేయడం ఇది రెండోసారి. వీరిద్దరు గతంలో ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’ చిత్రంలో కలిసి పనిచేశారు. లేడీ గాగా రావడంతో జోకర్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా జోకర్ 2 ఉంటాడని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా జోకర్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యిందని DC ట్వీట్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకోని జోకర్ 2 సినిమా అక్టోబర్ 4న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ మొదలుపెట్టనున్న మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. మిడ్ ఏప్రిల్ లో జోకర్ 2 ట్రైలర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ తో జోకర్ 2 సినిమాపై అంచనాలు పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. ఇండియాలో కూడా జోకర్ సినిమాని మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అక్టోబర్ 4న జోకర్ సినిమా సాలిడ్ బాక్సాఫీస్ నంబర్స్ ని పోస్ట్ చేయడం గ్యారెంటీ. మరి పార్ట్ 1తో పది వేల కోట్లు రాబట్టిన జోకర్ ఫిల్మ్ యూనిట్, జోకర్ 2తో వరల్డ్ వైడ్ ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడతారో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..