NTV Telugu Site icon

Johnny Sins with Ranveer Singh: జానీ సిన్స్ తో రణ్వీర్ సింగ్.. ఇదేం అరాచకం రా అయ్యా!

Johnny Sins News

Johnny Sins News

Johnny Sins Ad with Ranveer Singh goes Viral: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈమధ్య ఆయన ఎక్కువగా హీరోగా నటిస్తున్న డాన్-3 సినిమా కోసం వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నాడు. రణవీర్ తన బోల్డ్ నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కాడు. రణవీర్ సింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో బోల్డ్ కేర్ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నటుడు ప్రముఖ అమెరికన్ పోర్న్‌స్టార్‌తో కలిసి రణవీర్ సింగ్ కనిపిస్తున్నాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. నిజానికి రణవీర్ సింగ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో ప్రముఖ పోర్న్ స్టార్ జానీ సిన్స్‌తో రణవీర్ సింగ్ కనిపిస్తాడు.

Krishna Vamsi: హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్.. కృష్ణవంశీ ఏమన్నాడంటే..?

ఆయనే కాకుండా ఇంకా చాలా మంది కూడా కనిపిస్తారు. అలాంటి పరిస్థితిలో, ఈ వీడియో చూసిన తర్వాత, పోర్న్ స్టార్‌తో రణవీర్ ఏమి చేస్తున్నాడు అని ఆ వీడియో చూస్తున్న వారు ఆశ్చర్యపోతున్నారు. సెక్సువల్ హెల్త్ కేర్ బ్రాండ్ అయిన బోల్డ్ కేర్ #TakeBoldCareOfHer అనే ప్రచారం ప్రారంభించింది. ఈ బ్రాండ్ ను రణవీర్ సింగ్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రచారం పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది, పురుషుల లైంగిక ఆరోగ్యం గురించి సాధారణ పద్ధతిలో మాట్లాడటం దీని ఉద్దేశ్యం . ఈ ప్రచారంలో రణవీర్ మాత్రమే కాకుండా అడల్ట్ స్టార్ జానీ సిన్స్ కూడా అతనితో ఉన్నారు. సీరియల్ సీన్ ప్ తరహాలో ఈ ప్రకటన రూపొందించబడింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అయితే ఈ అరాచకారం ఏంది రా అయ్యా అని కామెంట్ చేస్తున్నారు.

Show comments