Johnny Master Joined in Janasena party with Pawan Kalyan wishes: ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి కొద్ది రోజుల నుంచి ఏపీలో జానీ మాస్టర్ యాక్టివ్గా పర్యటనలు చేశారు. కొన్నాళ్ల క్రితం నెల్లూరులో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఒక పోరాటానికి సైతం ఆయన మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంతే కాదు డిసెంబర్ 29వ తేదీన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్యని కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేతలతో కలిసి హరినామ జోగయ్యను పాలకొల్లు నివాసంలో కలిసి మాట్లాడడంతో జానీ మాస్టర్ ఏపీ నుంచి జనసేన అభ్యర్థిగా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.
Priyanka Jain: బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశా.. ఏడుస్తూ సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్
ఇక దానికి ఊతం ఇచ్చే విధంగా జానీ మాస్టర్ కూడా జనసేన లోని కీలక నేతలతో ఆ మధ్య పెద్ద ఎత్తున భేటీ అయ్యారు. ఇక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా జానీ మాస్టర్ చెప్పుకుంటూ ఉంటారు. ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారమయ్యే డీ షో ద్వారా పాపులర్ అయిన ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆయన హీరోగా కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఒకపక్క హీరోగా మరొక పక్క కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తున్నా సరే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన జనసేనలో జాయిన్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే టీడీపీ-జనసేన పొత్తులో ఉన్న క్రమంలో జానీ మాస్టర్ కి ఎక్కడి సీటు దక్కుతుందో చూడాలి మరి.