Site icon NTV Telugu

John Wick: యాక్షన్ మూవీ నటుడి మృతి…

John Wick

John Wick

యాక్షన్ సినిమా ప్రియులకి బాగా పరిచయం ఉన్న సినిమా పేరు ‘జాన్ విక్’. యాక్షన్ సినిమాలకి బెంచ్ మార్క్ లాంటి ‘జాన్ విక్’ నుంచి ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా మార్చ్ 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీని చూడడానికి, ఆ యాక్షన్ ఎక్స్ట్రావెంజాని ఎంజాయ్ చెయ్యడానికి ‘జాన్ విక్’ ఫ్రాంచైజ్ ఫాన్స్ అందరూ రెడీ అవుతూ ఉండగా అందరికీ షాక్ ఇస్తూ… జాన్ విక్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో నటించిన ‘లాన్స్ రెడ్డిక్’ మరణించాడు అనే వార్త బయటకి వచ్చింది. జాన్ విక్ సినిమాల్లో హోటల్ మేనేజర్ ‘చారన్’ పాత్రలో లాన్ రిడ్డిక్ నటించాడు. ఈ అరవై ఏళ్ల యాక్టర్ ఎలా మరణించాడు అనే విషయంపై ఇంకా వివరాలు బయటకి రావాల్సి ఉన్నాయి. లాన్స్ రిడ్డిక్ మరణ వార్త వినగానే షాక్ అయిన జాన్ విక్ చిత్ర యూనిట్, జాన్ విక్ ఫ్రాంచైజ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు.

Read Also: Mahesh Babu: ఈయన అన్నం తింటున్నాడా లేక అందం తింటున్నాడా?

Exit mobile version